జాతీయ వార్తలు

విస్తరణలో చోటులేని తెలుగు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ముచ్చటగా మూడోసారి చేసిన కేంద్ర మంత్రివర్గం విస్తరణలో తెలుగు రాష్ట్రాలవారికి చోటు దక్కలేదు. రెండు రాష్ట్రాల్లో ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు సరికదా, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను తొలగించి బిజెపి అధినాయకత్వం చేతులు దులుపుకున్నది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబుకు సహాయ మంత్రి పదవి ఇస్తారని ఆశ చూపించి వదిలివేశారు. హరిబాబు మంత్రి పదవి లభిస్తుందనే ఆశతో కుటుంబ సభ్యులను తీసుకుని ఢిల్లీకి వస్తే ఆయనకు నిరాశే ఎదురైంది. బండారు దత్తాత్రేయ స్థానంలో తెలంగాణాకు చెందిన యువ నాయకుడికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు లేదా శాసనసభ్యుడు జి.కిషన్‌రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే చివరకు వారికి కూడా నిరాశే మిగిలింది. 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసుకోవాలని కలలు కంటున్న బిజెపి అధినాయకత్వం ఎందుకిలా వ్యవహరించిందనేది ఎవ్వరికి అర్థం కావటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసుకోవటం అధినాయకత్వానికి ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.