జాతీయ వార్తలు

అహంకారమే అనర్థాలకు మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని, మే 14: భూతాపం, ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నీకన్నా నేనే ఎక్కువ గొప్పవాడిని’ అనే అహంకార వైఖరే వీటివెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న సింహస్థ కుంభమేళా సందర్భంగా శనివారం ‘లివింగ్ ది రైట్ వే’ అనే అంశంపై ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘ప్రపంచం ఇప్పుడు రెండు రకాల సంక్షోభాలను ఎదుర్కొంటోంది. వాటిలో ఒకటి భూతాపం కాగా, రెండోది ఉగ్రవాదం. వీటికి పరిష్కారం ఏమిటి? వీటి పుట్టుక వెనుక కారణాలేమిటి? నీకన్నా నేనే ఎక్కువ పవిత్రుడ్ని అనే వైఖరి లేదా నీ మార్గం కన్నా నా మార్గమే సరయినదన్న ఆలోచనే. మనల్ని యుద్ధం వైపు లాగుతున్నదీ ఇదే’ అని ప్రధాని అన్నారు. అంతేకాదు మనల్ని యుద్ధాలవైపునకు తీసుకు వెళ్తున్నవాటిలో విస్తరణ వాదం కూడా ఒకటని, కాలం మారిందని, సమస్యలకు విస్తరణవాదం పరిష్కారం కాదని, అలాంటి వాటికతీతంగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌తో కలిసి 51 సూత్రాల ‘సింహస్థ డిక్లరేషన్’ను ప్రధాని విడుదల చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య యుద్ధాలను ఎలా నివారించాలనేదేనని, అయితే విభేదాలను ఎలా పరిష్కరించాలో భారతీయులకు బాగా తెలుసునని మోదీ అన్నారు. తన వాదనను సమర్థించుకోవడానికి ఆయన పురాణాల్లో రాముడ్ని, ప్రహ్లాదుడినీ ఉదాహరణగా పేర్కొన్నారు. ‘తండ్రి ఆజ్ఞను పాలించి అడవులకు వెళ్లిన శ్రీరాముడ్ని భారతీయులు దేవుడిగా పూజిస్తారు. అదే సమయంలో తండ్రిని ఎదిరించిన ప్రహ్లాదుడ్నీ పొగుడుతారు. అదేమాదిరిగా సీతను, మీరాను పూజిస్తారు. ఘర్షణను నివారించడం భారతీయులకు ఎంతబాగా తెలుసో ఇవి నిరూపిస్తాయి’ అని మోదీ అన్నారు. అంతేకాదు, ప్రపంచం ఇప్పుడు ఆచరిస్తున్న దాన్ని భారతీయులు శతాబ్దాలుగా ఆచరిస్తున్నారని కూడా ఆయన అన్నారు. ‘్ధరిత్రీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. అయితే భారత దేశంలో చిన్న పిల్లలు ఉదయం నిద్ర లేచినప్పుడు భూమిపై పాదం పెట్టేముందు భూమాతను క్షమించమని కోరాలని తల్లిదండ్రులు వారికి చెప్తారు’ అని ఆయన అన్నారు.
‘అమృత్ బిందు’గా పిలవబడే డిక్లరేషన్ రెండేళ్లపాటు నిపుణులంతా కలిసికట్టుగా చేసిన కృషి ఫలితమని మోదీ అన్నారు. సాధువులు, సమాజంకోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న వారితోసహా ఈ శక్తులన్నీ ఒక మార్గంలో పయనించినట్లయితే సమాజంలో పెనుమార్పులు తీసుకురాగలుగుతారని, ఆ విషయంలో ఈ 51 సూత్రాలు భారత దేశానికి, ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతాయని ఆయన చెప్పారు.

chitram శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో కలిసి ‘సింహస్థ డిక్లరేషన్’ను
విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ