జాతీయ వార్తలు

ఆల్‌మట్టి ఎత్తు పెంపునకు చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: కృష్ణా నదిపై ఉన్న ఆల్‌మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవాలన్న కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ నిరాకరించింది. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నందున తొలుత కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అనుమతి పొందాలని సూచించింది. గత నెలలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని ‘ఇఎసి’ (ఎక్స్‌పర్ట్ అప్రైసల్ కమిటీ) నదీ పరివాహక ప్రాంతాన్ని, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులను పరిశీలించింది. సిడబ్ల్యుసి అనుమతి లేకపోవడాన్ని ఇఎసి గుర్తించింది.
ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి ఇవ్వలేదని సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ఇఎసి సిఫార్సుల తదనంతరం మంత్రిత్వ శాఖ ఆమోదం ఇస్తుందని ఆయన తెలిపారు. కాగా కృష్ణా నదిపై ఉన్న ఆల్‌మట్టి విషయంలో సిడబ్ల్యుసి అనుమతి పొందాలని ఇఎసి చాలా స్పష్టంగా చెప్పింది. కర్నాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు పలు పర్యాయాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆల్‌మట్టి డ్యాం ప్రస్తుతం ఉన్న ఎత్తు 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఆరాటం. ఈ ప్రాజెక్టుకు అదనంగా నాలుగు ఎత్తిపోతల (లిఫ్ట్) పథకాలను ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నది. అనుకున్నది సాధించుకుంటే 907 టిఎంసిల నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. డ్యాం ఎత్తు పెంచినట్లయితే 17 గ్రామాలు, బాగల్‌కోట్‌లోని 10 వార్డులు, విజయపుర జిల్లాలోని 3 గ్రామాలు నీట మునుగుతాయి. దీనికి 58,375 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది, ఇందులో 31,439 హెక్టార్ల నూమి మునిగి పోనుండగా, మరో 25, 936 హెక్టార్లు మునిగి పోయే ప్రాంతాల పునరావాసం కోసం అవసరమవుతుంది. పైగా దీనికి అటవీ శాఖ ఆమోదం లభించాల్సి ఉంటుంది.