జాతీయ వార్తలు

రాజకీయ లక్ష్యాలపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మూడో మంత్రివర్గ విస్తరణ కూర్పులో ఆచితూచి వ్యవహరించారు. కేవలం పరిపాలనపై మాత్రమే కాకుండా రాజకీయ లక్ష్యాలపై దృష్టి సారించారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించిన ధరేంద్ర ప్రధాన్ ఒడిశాకు చెందిన ప్రముఖ నాయకుడుగా ఎదిగారు. దీంతో పాటు తన మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఆయన సక్సెస్ సాధించటం కూడా ఆయన ప్రమోషన్‌కు కారణమైంది. పేదలకు ఎల్పీజీ కనెక్షన్‌ల ఉచిత పంపిణీ పథకం విజయవంతం చేయటంలో ప్రధాన్ కృషి చేశారు. దీనికంటే ముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్‌షా అత్యంత ప్రాధాన్య రాష్ట్రాల్లో ఒడిశా ఒకటిగా ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఇరవై నెలలకు ముందు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక నిర్మలాసీతారామన్‌కు కేబినెట్ ర్యాంక్‌తో పాటు అత్యంత కీలకమైన రక్షణ శాఖను ఇవ్వటం దక్షిణ భారత్‌కు బిజెపి ప్రాధాన్యమిస్తుందన్న సంకేతాల్ని కచ్చితంగా పంపిస్తుంది. నఖ్వీకి కేబినెట్ ర్యాంక్ ఇవ్వటం, మాజీ ఐ ఏ ఎస్ అధికారి అల్ఫాన్స్ కన్నన్‌థానమ్‌ను మంత్రిమండలిలో చేర్చుకోవటం కాషాయ పార్టీని మైనార్టీలకు మరింత దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగమే. ఆల్ఫాన్స్‌ను మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరుంది. పైగా కేరళలో క్రిస్టియన్ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో బలంగా ఎదిగేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇక్కడి క్రిస్టియన్ల మన్ననలు పొందటం చాలా అవసరం. నఖ్వీకి కేబినెట్ ర్యాంక్‌తో మోదీ మంత్రిమండలిలో నఖ్వీ ఒక్కరే ముస్లిం మంత్రి అవుతారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల్లో ముగ్గురు బ్రాహ్మణులు శివప్రతాప్ శుక్లా, అశ్విని కుమార్ చౌబె, అనంత్‌కుమార్ హెగ్డేలు ఉన్నారు. ఇద్దరు రాజ్‌పుత్‌లు- ఆర్కే సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ కాగా, సత్యపాల్‌సింగ్ జాట్, వీరేంద్ర కుమార్ దళితుడు, మిగతా ఇద్దరు హరదీప్ పూరి సిక్కు, ఆల్ఫాన్స్ క్రిస్టియన్. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శుక్లాను మంత్రివర్గంలోకి తీసుకోవటం ద్వారా యుపిలో తమ పార్టీ బ్రాహ్మణులకు మరింత దగ్గర అయినట్లవుతుంది. ఇక అశ్విని కుమార్ చౌబే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు సన్నిహితుడైనప్పటికీ, సొంతరాష్ట్రం బిహార్‌లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌మోదీతో మంచి సంబంధాలు లేవు. అయితే బిహార్‌లోని ఓబిసిల్లో పార్టీ విస్తరణలో భాగంగా చౌబేకు మంత్రివర్గంలో స్థానం తప్పనిసరి అయింది. 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎన్నికను తీవ్రంగా విమర్శించిన ఆర్కేసింగ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించటం అందరినీ ఆశ్చర్య పరిచింది. మాజీ హోం సెక్రటరీగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో అదే రాష్ట్రానికి చెందిన రాజీవ్ ప్రతాప్‌రూడీని తప్పించి ఆర్కేసింగ్‌కు చోటు కల్పించారు. జాట్ నేత సంజీవ్ బాల్యాన్ స్థానంలోకి సత్యపాల్‌సింగ్‌ను తీసుకువచ్చారు. వీరేంద్రకుమార్ మధ్యప్రదేశ్‌కు చెందిన దళిత నేత, వచ్చేసంవత్సరం మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం మీద కొత్తగా కేబినెట్‌లో చేరిన తొమ్మిది మంది పార్లమెంటరీ, అడ్మినిస్ట్రేటివ్ సామర్థ్యాల మేలు మిశ్రమం అని చెప్పవచ్చు.