జాతీయ వార్తలు

సీనియర్ సిటిజన్స్ క్లబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆదివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు బ్యూరోక్రాట్లను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని తన రాజకీయ సహచరులపై నమ్మడం లేదోమోననిపిస్తోందని వ్యాఖ్యానించింది. అంతేకాదు కొత్తగా చేరిన తొమ్మిది మంది మంత్రులను ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్’గా ఆ పార్టీ అభివర్ణిస్తూ, దేశంలో ఓ వ్యక్తి సగటు వయసు 27 ఏళ్లు అయితే కొత్తగా చేరిన మంత్రుల సగటు వయసు అరవై ఏళ్ల పైమాటేనని పేర్కొంది. మంత్రివర్గంలో మార్పుల ప్రక్రియలో ప్రధానిని దూరంగా పెట్టారేమోననిపిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాయే ప్రధాన మంత్రి అనిపిస్తోంది అని కూడా మంత్రివర్గంలో మార్పులకు ముందు అమిత్ షా కేంద్ర మంత్రులను పిలిచి వారిని రాజీనామా చేయమని కోరినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ అన్నారు. ఆదివారం కేంద్ర మంత్రివర్గంలో చేరిన తొమ్మిది మందిలో నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు-మాజీ ఐఏఎస్ అధికారి ఆల్ఫాన్సో కన్నన్‌థానం, మాజీ దౌత్యవేత్త హర్‌దీప్ సింగ్ పురి, ముంబయి మాజీ పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె సింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రధానికి తన రాజకీయ సహచరులను విశ్వసించడం లేదనే దాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు. అంతేకాదు వచ్చే ఏడాది ప్రారంభంలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని మతతత్వ రాష్ట్రంగా చేయడానికి ఆ రాష్ట్రంనుంచి ఒక ‘డాక్టర్ బీటర్’ను మంత్రివర్గంలో చేర్చుకున్నట్లు కనిపిస్తోందని తివారీ అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన అనంతకుమార్ హెగ్డే కర్నాటకలోని కార్వార్‌లో కొంతమంది డాక్టర్లను కొడ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఈ ఏడాది ప్రారంభంలో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన విషక్షం తెలిసిందే. కాగా, మంత్రివర్గంనుంచి రాజీవ్ ప్రతాప్ రూడీ, కల్‌రాజ్ మిశ్రాలను తొలగించడాన్ని ప్రస్తావిస్తూ ఇది మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించడమేనని కూడా ఆయన అన్నారు. చివరికి నిర్మలా సీతారామన్‌ను రక్షణ మంత్రిగా నియమించడంపైన కూడా తివారీ విమర్శలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ హయంలో దేశ ఎగుమతులు, దిగుమతులు దారుణంగా పడిపోయాయని, వాణిజ్య శాఖలాగా రక్షణ శాఖను ఆమె నిర్వహించబోరని ఆశిస్తున్నామన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించడం కేవలం కంటితుడుపు మాత్రమేనని, ఎందుకంటే ముస్లింల పట్ల బిజెపి వైఖరి ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు. ఉమాభారతినుంచి జలవనరులు, గంగానది ప్రక్షాళన శాఖలను తప్పించడంపై తివారీ వ్యాఖ్యానిస్తూ బిజెపి పాపాలతో గంగానది ఇప్పటికే మైలపడిందంటూ ‘రామ్ తేరీ గంగా మైలీ..’ సినిమా పాటను ప్రస్తావిస్తూ అన్నారు.