జాతీయ వార్తలు

హెచ్చరికలు.. ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కేంద్ర కేబినెట్ మంత్రి ఉమాభారతి, సహాయ మంత్రి విజయ్ గోయల్ ప్రాధాన్యత తగ్గించటం ద్వారా పనిచేయకపోతే మంత్రి పదవులు ఊడతాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినట్లయింది. నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ కేటాయించి సమర్థంగా పనిచేస్తే పదోన్నతితోపాటు ప్రాధాన్యత కూడా లభిస్తుందని చెప్పకనే చెప్పారు. నిర్మలా సీతారామన్‌కు కేబినెట్ హోదాతోపాటు అతిముఖ్యమైన రక్షణ శాఖ కేటాయించటం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉమాభారతిని నీటిపారుదల శాఖ నుంచి తొలగించి తాగునీరు, పారిశుధ్యం శాఖకు మార్చడం ద్వారా ఆమె ప్రాధాన్యతను తగ్గించారు. రాజీనామా చేసేందుకు తిరస్కరించినందుకే ఆమెకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించినట్లు తెలిసింది. ఇండిపెండెంట్ శాఖను నిర్వహించిన విజయ్ గోయల్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించటం ద్వారా పనితీరు మారకపోతే మంత్రి పదవి ఊడుతుందనే సందేశం ఇచ్చారు. రక్షణ శాఖను చేపట్టడంతోపాటు నిర్మలా సీతారామన్ పదవిరీత్యా భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సభ్యత్వం కూడా చేపడతారు. ప్రధాన మంత్రి అధ్యక్షత వహించే ఈ కమిటీలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సభ్యులు. రక్షణ శాఖ ద్వారా నిర్మలా సీతారామన్ వీరిస్థాయికి ఎదిగిపోయారు. నరేంద్ర మోదీ ప్రోద్భలంతో నిర్మలా సీతారామన్ అకస్మాత్తుగా సీనియర్ మంత్రిగా మారిపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే ఇందిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రక్షణ శాఖను చేపడతున్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రక్షణ శాఖను కూడా తానే నిర్వహించారు. దైవకృప మూలంగానే తానీస్థాయికి ఎదగ గలిగానని సీతారామన్ ప్రమాణ స్వీకారోత్సవం తరువాత విలేఖరులకు చెప్పారు. పీయూష్ గోయల్ రైల్వే శాఖతోపాటు తన పాత శాఖ బొగ్గు శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజ వాయువుల శాఖతోపాటు రాజీవ్ ప్రతాప్ రూడీ వదిలిపోయిన నైపుణ్య అభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తారు. పదోన్నతి లభించిన మరో మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి మైనారిటీ వ్యవహారాల శాఖ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేష్ ప్రభుకు వాణిజ్య శాఖను కేటాయించారు. ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జల వనరుల శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇంత కాలం ఈ శాఖను నిర్వహించిన ఉమా భారతికి మంచినీరు, పారిశుధ్య శాఖను కేటాయించటం ద్వారా ఆమె ప్రాధాన్యతను తగ్గించారు. మిగతా సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ శాఖల్లో ఎలాంటి మార్పులు లేవు. అరుణ్ జైట్లీ ఇక మీదట ఆర్థిక శాఖను మాత్రమే నిర్వహిస్తారు. కొత్త మంత్రుల్లో హర్దీప్ పురి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి (ఇండిపెండెంట్), హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కె సింగ్ ఇంధనం (ఇండిపెండెంట్), కెజె ఆల్ఫోన్స్ పర్యటన, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞానం శాఖల బాధ్యతలు నిర్వహిస్తారు. క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేసి క్రీడల శాఖను రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు అప్పగించారు.

చిత్రం..పదోన్నతి చెందిన మంత్రులు, కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్