జాతీయ వార్తలు

143చట్టాలకు చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 4: వివిధ కారణాలతో అమలుకునోచుకోని అలాగే సవరణల దశలోనే ఉన్న 143 చట్టాలను వదిలించుకోవాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఓ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన తరువాత ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టిబి జయచంద్ర సోమవారం వెల్లడించారు. ‘కొన్ని మార్పులకోసం ఎంతోకాలం పెండింగ్‌లో ఉన్నవి, మరికొన్ని అమలుకు నోచుకోని వాటిని ఉపసంహరించుకుంటాం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో 135 చట్టాలు రాష్టప్రరిధిలోనూ ఎనిమిది కేంద్రం నుంచి వచ్చినవని ఆయన పేర్కొన్నారు. ఆర్థికశాఖతోపాటు అన్ని శాఖలకు చెందిన చట్టాలు అందులో ఉన్నాయని జయచంద్ర తెలిపారు. నిరుపయోగమైన చట్టాలను వదిలించుకోవాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. రెండోదశ బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ ధర పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోరమంగళ మీదుగా బెల్లాండూర్ ప్రవహించే సరస్సులో మురుగునీటిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన 12 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.