జాతీయ వార్తలు

ఇంత దారుణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: విద్యను అభ్యసించాల్సిన చిన్నారులతో పాఠశాలల్లో పాచిపనులు చేయంచడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ‘ఇక్కడికొచ్చే పిల్లలు చదువుకోవడానికేనా, వీళ్లను విద్యార్థులనే అందామా? ఇలాగే బోధిస్తున్నారా?’ అంటూ ఢీల్లీలోని కొన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఢిల్లీలోని కొన్ని స్కూళ్లలో పిల్లలు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి చెత్తకుండీలలో వేయడాన్ని, చెత్తకుండీలు నిండిపోయి ఉన్న ఫోటోలను ఒక స్వచ్చంద సంస్థ హైకోర్టుకు సమర్పించడంతోపాటు పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఫోటోలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి. హరి శంకర్ మండిపడ్డారు. ‘ఇలా ఉంటే పిల్లలు పాఠశాలలకు వస్తారా? టాయ్‌లెట్స్ ఎలా ఉన్నాయి? మీరేం పటించుకోరా?’ అని ప్రిన్సిపాళ్లను నిలదీసింది. ఇదే విషయంపై గతంలోనూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తీవ్రంగా స్పందించింది. ‘మీ పిల్లలతో ఇలాంటి పనులే చేయిస్తారా? ఉద్యోగాలు మాని ఇంట్లో కూర్చోండి’ అంటూ ఢిల్లీ ప్రభుత్వ, మున్సిపల్ ఉద్యోగులపై తీవ్రస్థాయలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లోని చెత్తకుండీలను ప్రతిరోజూ శుభ్రం చేయడం లేదని, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోని చెత్తను సైతం సూళ్లకు చెందిన చెత్తకుండీల్లోనే వేస్తున్నారని స్వచంద సంస్థ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ప్రతిరోజూ చెత్తకుండీలను శుభ్రం చేసేలా చూసే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలావుండగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్తను శుభ్రం చేసేందుకు ఒక సంస్థ చాలా తక్కువ ధరకు కొటేషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకే ఆ బాధ్యతను అప్పగించింది. తీరా పనులు ప్రారంభించాక ఆ మొత్తానికి పనులు చేయలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక చేతులెత్తేసింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది.