జాతీయ వార్తలు

పట్టువీడని దినకరన్ వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 4: అన్నాడిఎంకెలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి పంపిన ఆహ్వానాన్ని దినకరన్ గ్రూప్ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. దినకరన్ విధేయుల్లో ఒకరైన తంగతమిళ్ సెల్వన్ మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ‘ఇంతకుముందు ఇదేవిధంగా జరిగిన పార్టీ సమావేశానికి ఎందుకు పిలవలేదని మేం వాళ్లను ప్రశ్నించాం’ అని అన్నారు. మంగళవారంనాటి పార్టీ సమావేశం విషయంలో తమకు మరోవైఖరి లేనేలేదని, పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించాలన్న డిమాండ్‌లో వెనుకడుగు వేసే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. దినకరన్ నేతృత్వంలోని 19మంది ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.