జాతీయ వార్తలు

49మంది శిశువుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫరూఖాబాద్ (యుపి), సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లో మరో ‘గోరఖ్‌పూర్ దారుణం’ బయటపడింది. ఫరూఖాబాద్ జిల్లా ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలో 49మంది నవజాత శిశువులు మరణించారు. వీరిలో 30మంది నియోనాటల్ ఐసియులో చనిపోగా 19మంది డెలివరీ సమయంలో చనిపోయారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్, ముఖ్య వైద్యాధికారి ఉమాకాంత్ పాండే, ఆసుపత్రి సూపరింటెండెంట్ అఖిలేశ్ అగర్వాల్‌ను విధుల నుంచి తప్పించారు. ‘్ఫరూఖాబాద్‌కు ఉన్నతస్థాయి బృందాన్ని పంపిస్తున్నాం. ఆసుపత్రిలో సాంకేతిక కారణాలను వారు విశే్లషిస్తారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనల నేపథ్యంలో డిఎం, సిఎంఓ, సిఎంఎస్‌లను తొలగిస్తున్నాం’ అని వైద్య ఆరోగ్యశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆసుపత్రిలోని మహిళా వార్డులో 468 డెలివరీలు అయ్యాయని చనిపోయిన వారిలో ఎక్కువమంది మరణానికి ఆక్సిజన్ అందకపోవటమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నెలరోజుల వ్యవధిలో చనిపోయిన 49 మందిలో 30 మంది పెరినాటల్ ఆస్ఫిషియా (పుడుతున్న సందర్భంలో, పుట్టిన వెంటనే సాధారణ స్థాయిలో ఊపిరి తీసుకోకపోవటం) కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని మీడియా అనవసరంగా సంచలనం చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ అవనీశ్ అవస్థి ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం..ఫరూఖాబాద్ దవాఖానాలో చికిత్స పొందుతున్న చిన్నారులు