జాతీయ వార్తలు

పట్టుబట్టిన భారత్.. మెట్టు దిగిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఎన్‌డిఏ ప్రభుత్వం డోక్లామ్ సమస్యను ఎదుర్కోవడంలో గట్టిగా వ్యవహరించినందుకే పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా విషయంలో చైనా దిగివచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జెఇఎం, ఎల్‌ఇటిల గురించి బ్రిక్స్ తీర్మానంలో ప్రస్తావించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉగ్రవాదులను పెంచి పోషించే వారిని జవాబుదారీ చేయాలంటూ తీర్మానించటం నేరుగా పాకిస్తాన్‌ను తప్పుపట్టటమే. మామూలుగా అయితే ఉగ్రవాదానికి సంబందించి పాకిస్తాన్‌ను జవాబుదారి చేసేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్నీ చైనా గతంలో అడ్డుకునేది. అయితే ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్ భేటీలో ఉగ్రవాదంతోపాటు ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహించే దేశాలను జవాబుదారీ చేయాలని తీర్మానించటం చైనా వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పడుతోంది. డోక్లామ్ వ్యవహారంలో భారతదేశం అత్యంత గట్టిగా వ్యవహరించటం, చైనా ఎన్ని రకాలుగా బెదిరించినా, తమ ఆధీనంలోని మీడియాద్వారా ఎన్ని రంకెలు వేసినా తొణకక, బెణకక వ్యవహరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం సైనిక చర్యను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడటంతోపాటు యుద్ధం జరిగితే దీటుగా జవాబు చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకోవటంతో చైనా ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. డోక్లామ్ నుండి రెండు దేశాల సైనికులను ఏకకాలంలో ఉపసంహరించుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న భారతదేశ ప్రతిపాదనను చైనా అంగీకరించి ఉండకపోతే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగటం సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. డోక్లామ్ సమస్య పరిష్కారం కాకపోతే నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేవారుకాదు. ఒక వ్యవస్థాపక సభ్య దేశం గైర్హాజరైతే బ్రిక్స్ వ్యవస్థ ప్రాధాన్యత కోల్పోవటంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రభావం తగ్గేది. డోక్లామ్ గొడవ మూలంగా భారతదేశంపై చైనా దాడి చేసినా, పరిమిత యుద్ధానికి దిగినా నష్టం చైనాకే జరిగేది. భారతదేశం బేషరతుగా తమ సైన్యాలను ఉపసంహరించుకోవలసిందేనని దాదాపు నెలా పదిహేను రోజులపాటు పట్టుపట్టిన చైనా చివరకు రెండు దేశాల సైన్యాలను ఏకకాలంలో ఉపసంహరించుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న భారతదేశం ప్రతిపాదనను అంగీకరించక తప్పలేదు. ఈ అంశంలో చైనా ప్రతిష్ట దెబ్బతినగా భారతదేశం ప్రతిష్ట, పలుకుబడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఖండించేందుకు అంగీకరించటంతోపాటు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను జవాబుదారీ చేయాలంటూ బ్రిక్స్ తీర్మానంలో చేసిన డిమాండ్‌ను ఆమోదించిందని విశే్లషకులు చెబుతున్నారు. పలు అంశాల్లో చైనా తన వైఖరి, అభిప్రాయాలను మార్చుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతర్జాతీ స్థాయిలో భారతదేశం రోజురోజుకు ఎదిగిపోతుంటే, పాకిస్తాన్ దిగజారిపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద దేశంగా ముద్రపడుతున్న పాకిస్తాన్‌తో ఎక్కువకాలం స్నేహం చేయటం సాధ్యం కాదనే వాస్తవాన్ని చైనా గుర్తిస్తోందనే మాట వినిపిస్తోంది.

చిత్రం..బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దంపతులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ.