జాతీయ వార్తలు

డోక్లామ్‌లకు స్వస్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 5:్భరత దేశం ప్రాధాన్యతను ఆమోదించేందుకు చైనా సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల తరువాత మరోసారి పంచశీల సూత్రాల గురించి చైనా మాట్లాడింది. పంచశీల సిద్ధాంతాల మేరకు భారత దేశంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పడం జీజింపింగ్ చెప్పటం ఈ మార్పులకు నిదర్శమని అంటున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషె మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలను బ్రిక్స్ ప్రకటనలో ఉగ్రవాదం సంస్థలుగా పేర్కొనేందుకు నిన్న అంగీకరించిన చైనా డోక్లామ్ లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చూసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించి అందరిని ఆశ్చర్యపరిచింది. డోక్లామ్ లాంటి సంఘటనలు ఇక మీదట జరుగకుండా చూసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటూ మంగళవారం జియామెన్‌లో జరిగిన ముఖాముఖీ చర్చల సందర్భంగా నరేంద్ర మోదీ చేసిన సూచనను జీజింపింగ్ ఆమోదించారు. డోక్లామ్ ఉద్రిక్తత నేపథ్యంలో రెండు దేశాల అధినాయకులు సుహృద్భావ వాతావరణంలో గంటపాటు చర్చలు ఆసక్తికరంగా మారింది. రెండు దేశాల సంబంధాలు మరింత దృఢపడాలంటే సరిహద్దుల్లో శాంతి,యుత వాతావణం నెలకొలకొనటం ఎంతో అవసరమని విదేశీ వ్యవహారుల శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్న షియామెన్ నగరంలో రెండు దేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం జయశంకర్ ఈ ప్రకటన చేశారు. నరేంద్రమోదీ, జిన్‌పింగ్‌లు డోక్లామ్ ఉద్రిక్తత,సరిహద్దుల్లో ఇలాంటి సంఘటనలు తరచు జరగటం వలన రెండు దేశాల సంబంధాలు చెడిపోతాయనేది మోదీ స్పష్టం చేశారనీ, అందుకే జయశంకర్ సమావేశానంతరం ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. జీ జిన్‌పింగ్‌తో జరిగిన చర్చలు సంతృప్తికరంగా, ఫలితాలనిచ్చే విధంగా జరిగాయని నరేంద్ర మోదీ చర్చల అనంతరం ట్వీట్ చేస్తే భారత దేశంతో సంబంధాలు సరైన దిశగా ముందుకు కదులుతున్నాయని జిన్‌పింగ్ వ్యాఖ్యానించటం గమనార్హం. రెండు దేశాల మధ్య నెలకొనే విభేదాలు వివాదాల రూపం తీసుకోనివ్వకూడదంటూ కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో కుదిరిన అవగాహనను ఇరువురు నాయకులు మరోసారి బలపరచటం కూడా భారత దేశ ప్రాధాన్యతలకు అద్దం పడుతోంది. డోక్లామ్ ఉద్రిక్తత విషయంలో భారత దేశం అత్యంత గట్టిగా వ్యవహరించటంతోపాటు అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించటం తెలిసిందే. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఎంతకైనా తెగించేందుకు సిద్దమైందనేది అర్థమైన తరువాతనే డోక్లామ్ విషయంలో చైనా దిగివచ్చింది. పాకిస్తాన్ కోసం భారత దేశంతో తగవు పెట్టుకోవటం వలన చైనాకు నష్టం తప్ప లాభం ఉండదనేది స్పష్టంగా అర్థమైన తరువాతనే జీజిపింగ్ ఇప్పుడు భారత దేశంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే ప్రకటన చేశారని అంటున్నారు. భారత దేశంతో గొడవ పెట్టుకోవటం వలన వన్ బెల్ట్ వన్ రోడ్ బృహత్తర పథకం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇదే జరిగితే చైనాకు ఆర్థికంగా ఊహించనంత నష్టం కలగటంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పరువు,ప్రతిష్ట దిగజారుతుంది. డోక్లామ్ వ్యవహారంలో లోపాయకారిగా సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకరించటం వల్ల ఇప్పటికే చైనా ప్రతిష్ట కొంత దిగజారింది. అందుకే చైనా ఇప్పుడు భారతదేశంతో వ్యవహరించే విషయంలో ఆచీతూచీ అడుగువేస్తోందని అంటున్నారు.

చిత్రం..జియామెన్‌లో మంగళవారం జరిగిన భేటీ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ కరచాలనం