జాతీయ వార్తలు

మహిళా ఎడిటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 5:సీనియర్ జర్నలిస్టు, లంకేశ్ పత్రిక అనే వార పత్రిక ప్రధాన సంపాదకురాలు గౌరీ లంకేశ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని రాజేశ్వరీ నగరంలో ఆమె ఇంటి వద్దనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను ఆదేశించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది ఇప్పుడే చెప్పలేమని, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను నిగ్గుదేలుస్తామని పోలీసు చీఫ్ ఆర్‌కె దత్తా తెలిపారు. గతంలో ఆమెతో తాను పలుమార్లు సమావేశమయ్యానని, తన ప్రాణానికి ముప్పు ఉన్నట్టు గౌరీ ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. తాము వెళ్లే సరికి గౌరి మృత దేహం రక్తపు మడుగులో పడి ఉందని, నాలుగు ఖాళీ తూటాలు సంఘటన స్థలంలో కనిపించాయని పోలీసు కమిషనర్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ నాలుగు తూటాల్లో ఎన్ని ఆమె శరీరంలోకి ప్రవేశించాయన్నది పోస్టుమార్టం తర్వాత గానీ తేలదన్నారు. గతంలో గౌరిపై పరువునష్టం కేసు దాఖలైంది. పది వేల జరిమానా కట్టి అదే రోజు ఆమె బెయిల్ పొందారు. కొందరు బిజెపి నేతల పరువు తీసే రీతిలో గౌరి రాతలు రాశారంటూ బిజెపి ఎంపీ ప్రహ్లాద్ జోషి ఆమెపై పరువునష్టం కేసు వేశారు.