జాతీయ వార్తలు

ముంబయిలో 11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 5: మహారాష్టల్రో మంగళవారం జరిగిన వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అపశ్రుతుల్లో 11మంది మరణించారు. దాదాపు అన్ని చోట్లా వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలోనే భక్తులు తరలివచ్చారు. ఔరంగాబాద్ జిల్లాలోని బిడ్కిన్ సమీపంలోని శివనాయక్ సరస్సులో మునిగి ముగ్గురు దుర్మరణం చెందారు. పూణెలో మరో నలుగురు, జల్‌గావ్‌లో ఇద్దరు, నాసిక్, బీడ్ జిల్లాల్లో జరిగిన విషాదకర ఘటనల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ముంబయిలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అధికార నివాసం దగ్గర ఏర్పాటు చేసిన కృత్రిమ సరస్సులో వినాయక నిమజ్జనం జరిగింది. నాసిక్‌లో జరిగిన ఉత్సవానికి రాష్టమ్రంత్రి గిరిశ్ మహాజన్ హాజరయ్యారు. దాదాపు అన్ని చోట్లా కూడా భక్తి పారవశ్యంతో భక్తులు చేసిన నినాదాల మధ్య వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగింది. మహారాష్ట్ర మరాఠా సంప్రదాయక నృత్యాలతోనూ, పాటలతోనూ సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. నిమజ్జనోత్సవం సందర్భంగా అంతటా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.