జాతీయ వార్తలు

నేరుగా నా వద్దకు రావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మంత్రులుగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు గానీ న్యాయసలహాకోసం తన వద్దకు రావద్దనని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు అవసరమైన పక్షంలో న్యాయశాఖ ద్వారా తన కార్యాలయాన్ని సంప్రదించాలని మంగళవారం ఇక్కడ విజ్ఞప్తి చేశారు. పలు అంశాలపై న్యాయ సలహా కోరుతూ మంత్రుల కార్యదర్శులు సరాసరి అటార్నీ జనరల్‌ను ఆశ్రయిస్తు నేపథ్యంలో ఈ మేరకు లేఖలు రాశారు. నేరుగా తన సలహా కోరవద్దని న్యాయశాఖ ద్వారా తన కార్యాలయాన్ని సంప్రదించాలని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఏ విషయంలో న్యాయసలహా కోరుతున్నారో సంక్షిప్తంగా తెలియజేస్తూ నోట్ పెట్టాలని ఏజి ఆఫీసు రాసిన లేఖ పేర్కొన్నారు. ఇంతకు ముందు అటార్నీ జనరల్‌గా పనిచేసిన ముకుల్ రొహత్గీ అనుసరించిన విధానానికి భిన్నంగా వేణుగోపాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం రోజుల తరబడి వేచి ఉండకుండా ఏమైనా సలహాలు అవసరమైతే నేరుగా తనను సంప్రదించాలని రొహత్గీ చెప్పేవారు. దీనిపై న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన లేఖ రాశారు. అత్యవసరమైనప్పుడు మంత్రులు, శాఖలు తనతో నేరుగా సంప్రదించవచ్చని రొహత్గీ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 76వ ఆధికరణ కింద న్యాయసలహాలు ఇచ్చే అధికారం అటార్నీ జనరల్‌కు ఉందని ఆయన వాదించేవారు.