జాతీయ వార్తలు

ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులకు సహకరించాలని ఇటీవల బాధ్యతలు చేపట్టిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
గురువారంనాడు హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి గడ్కరీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, ఎస్సారెస్పీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ తదితర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే ఈ ప్రాజెక్టులకు కావల్సిన శాఖాపరమైన అనుమతులు, నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలని కోరినట్టు హరీశ్‌రావు తెలిపా. మహబూబ్‌నగర్‌లో రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలను అందజేశారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జితేందర్‌రెడ్డి కోరారు.
సురేశ్ ప్రభును కలిసిన కెటిఆర్
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేష్ ప్రభును తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

చిత్రం..గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయన మంత్రి హరీశ్‌రావు, ఎంపి జితేందర్ రెడ్డి