జాతీయ వార్తలు

నీటి అడుగుభాగాన విల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్సా, సెప్టెంబర్ 7: రేప్ కేసులో జైలుకెళ్లిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం భక్తి ముసుగులో జరిపిన రాసక్రీడలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గుర్మిత్ రహస్య స్థావరం ఒకదాన్ని ఓ మీడియా సంస్థ ఛేదించింది. హర్యానాలోని సిర్సాలో 700 ఎకరాల్లో కోటల్లాంటి సౌధాలు నిర్మించుకుని అత్యంత విలాసవంతమైన జీవితం గడిపినట్టు వెల్లడైంది. 2002 నాటి రేప్ కేసుల్లో గుర్మిత్‌కు ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఓ హిందీ చానల్ బుధవారం డేరాబాబాకు చెందిన ప్రాంగణంలోకి ప్రవేశించగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. తన లైంగికవాంఛ తీర్చుకోడానికి డేరాబాబా ఏకంగా ఓ గుహ లాంటిదానే్న నిర్మించుకున్నాడు.
అదేమన్నా ఆషామాషీ గుహకాదు. నీటి అడుగున విల్లాలాంటిదాన్ని నిర్మించుకుని అందులో మహిళపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు వెల్లడైంది. మతంపేరుతో మహిళలను మభ్యపెట్టి అక్కడకు తీసుకెళ్లి అత్యాచారాలకు పాల్పడేవాడు డేరాబాబా. మయసభను మించిపోయిన కట్టడాలు తమను ఆశ్చర్యపరిచాయని మీడియా వెల్లడించింది. ఫుడ్ పార్టీలు, గానాభజనాలు జరుపుకోడానికి అక్కడ ఏర్పాట్లున్నాయి. 7 స్టార్ స్పా, మహిళలకోసం అత్యాధునిక జిమ్, స్విమ్మింగ్ పూల్ దర్శనమిచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్దే నీటిలో డేరాబాబా ఓ విల్లాను ఏర్పాటు చేసుకుని రాసక్రీడలు జరిపేవాడు.
డేరాలకోసం, విదేశీయులకోసం విల్లాను వాడేవాడని తెలిసింది. డేరాబాబా అరెస్టుతో సిర్సాలో అతడు నిర్మించుకున్న కోటలో జరిగే అనేక అసాంఘిక కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పోలీసులు సోదాలు నిర్వహిస్తే గుర్మిత్ రంగుల ప్రపంచం బట్టబయలు అవుతుంది. డేరా ప్రధాన కేంద్రం బయటా, లోపల ప్రస్తుతం భారీ బందోబస్తు కొనసాగుతోంది.
మరోపక్క గుర్మిత్ సింగ్ దత్తపుత్రిక హనీ ప్రీత్‌సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బహుశా ఆమె విదేశాలకు చెక్కేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. డేరాబాబాను జైలునుంచి తప్పించేందుకు హనీ విశ్వప్రయత్నాలు చేసిందన్న అభియోగాలున్నాయి. తొలుత నేపాల్ పారిపోయిందని భావించినా ఇప్పుడు అక్కడ కూడా లేదని, మరో దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చని కథనాలు వెలువడుతున్నాయి.