జాతీయ వార్తలు

కోర్టులకు వెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వివిధ శాఖల మధ్య తలెత్తే విభేదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, కోర్టులకు వెళ్లవద్దని న్యాయ మంత్రిత్వ శాఖ కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు సూచించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 3 కోట్ల కేసుల్లో 46శాతం దాకా ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య తలెత్తే విభేదాలకు సంబంధించినవే కావడంతో ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో న్యాయ శాఖ ఈ ప్రతిపాదన చేసింది. వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులకు వెళ్లడానికి బదులు ఆన్‌లైన్ మధ్యవర్తిత్వం, రాజీమార్గం ద్వారా పరిష్కారాలకు వెళ్లాలని న్యాయ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది. కోర్టు బయట పరిష్కారాలను చూస్తున్న వివిధ సంస్థల జాబితాను కూడా న్యాయ శాఖ ఆయా మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు పంపించింది. ‘దేశంలోని వివిధ కోర్టుల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 46 శాతం కేసులు ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లు, ప్రభుత్వ సంస్థలకు చెందినవే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ లిటిగేషన్లను తగ్గించడానికి వీలుగా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాలని న్యాయ శాఖ భావిస్తోంది. కోర్టులు ప్రజలకు మరింత మెరుగ్గా న్యాయాన్ని అందించడానికి ఈ చర్య తోడ్పడుతుందని భావిస్తున్నాం’ అని న్యాయ శాఖ వివిధ శాఖలకు పంపిన లేఖలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ‘అతిపెద్ద లిటిగెంట్’గా అభివర్ణించడం తెలిసిందే.