జాతీయ వార్తలు

గంటల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేభద్ర/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రైల్వే మంత్రి పదవినుంచి సురేశ్ ప్రభు తప్పుకోవడానికి కారణమైన రైలు ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం కొద్ది గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించక పోవడం అదృష్టం. తొలి ప్రమాదం గురువారం ఉదయం 6.25 గంటలకు చోటు చేసుకొంది. ఉత్తరప్రదేశ్‌లోని సోనేభద్ర జిల్లా ఓబ్రాదామ్ రైల్వే స్టేషన్ సమీపంలో శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనిల్ సక్సేనా న్యూఢిల్లీలో చెప్పారు. హౌరానుంచి జబల్పూర్ వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో చౌపాన్-సింఘరౌలి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇది జరిగిన కొద్ది గంటలకే ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రాంచి-్ఢల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ స్టేషన్‌కు చేరుకొంటున్న సమయంలో మింటో బ్రిడ్జి వద్ద రైలు ఇంజన్‌తో పాటుగా పవర్‌కారు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. మరమ్మతు పనుల కోసం ఢిల్లీ స్టేషన్‌లోని 15వ నంబరు ప్లాట్‌ఫామ్‌ను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాల షాక్‌నుంచి అధికారులు, ప్రయాణికులు తేరుకోకముందే ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్, ఫతేఘర్ స్టేషన్ల మధ్య రైలు పట్టాల మధ్య పగుళ్లను గుర్తించారు. ఢిల్లీ-కాన్పూర్ కాళింది ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో వెళ్లడానికి ముందే ఈ పగుళ్లను గుర్తించడంతో దెబ్బతిన్న మార్గానికి ముందే రైలును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసు అధికారులు చెప్పారు.

చిత్రం..రాంచి-్ఢల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రాంతంలో మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది