జాతీయ వార్తలు

నిష్పాక్షిక దర్యాప్తు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 7: తన సోదరి సీనియర్ పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవద్దని, ఆమెకు ఎవరితోనూ ఏ రకమైన వ్యక్తిగత విభేదాలు లేవని ఇంద్రజిత్ లంకేశ్ స్పష్టం చేశారు. తమకు న్యాయం జరగాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు నిష్పాక్షిక రీతిలో సాగాలని గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలా అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అడిగారని వెల్లడించిన ఇంద్రజిత్ ‘ఎవరి చేత దర్యాప్తు చేయించినా మాకు పూర్తిస్థాయి న్యాయం జరగాలి’ అని వెల్లడించారు. ఈ హత్యకు రాజకీయ రంగు పులమవద్దని, ఎవరూ దీన్ని వ్యక్తిగత ప్రయోజనంకోసం వాడుకోవద్దని అభ్యర్థించారు. ఎలాంటి ప్రకటనలూ లేకుండా సొంత డబ్బుతోనే 14 ఏళ్లుగా లంకేశ్ పత్రికను ఆమె నడుపుతూ వచ్చారని ఆ విధంగా తన తండ్రి వారసత్వాన్ని చివరి వరకూ కొనసాగించారని తెలిపారు. ఇతరులతో ఆమెకు సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చని, అయితే వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అన్నారు. ఇలావుండగా, గౌరీ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మొదలైంది. 21 మంది సభ్యుల సిట్ బృందానికి డిసిపి ఎం.ఎన్.అనుషెట్ సారథ్యం వహిస్తున్నారు. ఈ హత్యను రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు తీవ్రంగా గర్హించిన నేపథ్యంలో సిట్ దర్యాప్తుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఎన్‌ఐఏకు అప్పగించండి: మాయావతి
లక్నో: గౌరీ లంకేశ్ హత్య కేసును నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి అప్పగించాలని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. దేశంలో రచయితలు, జర్నలిస్టులు ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతున్నారని, గతంలో దభోల్కర్, పన్సారే, కల్‌బుర్గీలను ఇదే విధంగా కోల్పోయామని, ఈ సంఘటనకు ఖండించడంతోనే కేంద్రం బాధ్యత తీరిపోదని ఈ హత్యాకాండలపై ఎన్‌ఐఏ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోసంరక్షణ, లవ్‌జిహాదీ, యాంటీ-రోమియో, ఘర్‌వాపసీ తదితర కార్యక్రమాలపై కేంద్ర రాష్ట్రాలు చూపుతున్న శ్రద్ధ ఇలాంటి హత్యలను అరికట్టడంలోనూ చూపించాలని అన్నారు.

చిత్రం..గౌరీ లంకేశ్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఆమె ఇంటి వద్ద
విచారణ జరుపుతున్న ఇంటెలిజెన్‌స ఐజి బి.కె.సింగ్ బృందం