జాతీయ వార్తలు

దాడులకు వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, సెప్టెంబర్ 7: అవసరమైతే ఆధీనరేఖను దాటి శతృసేనల స్థావరాలపై దాడులు చేయడానికి వెనుకాడేది లేదని ఉత్తర కమాండ్ అధినేత లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అంబు హెచ్చరించారు. సరిహద్దు వివాదాలకు సంబంధించి మాట్లాడిన ఆయన పాకిస్తాన్ సాగిస్తున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లఘనలపై తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. పరిస్థితి విషమించే పక్షంలో ఎల్‌ఓసిని దాటి మరీ దాడి చేయడానికి తాము ఎంతమాత్రం వెనుకాడేది లేదని అన్నారు.
గత ఏడాది జరిగిన లక్షిత దాడుల గురించి ప్రస్తావించిన ఆయన అవసరమైతే భారతదేశం ఎలాంటి చర్యకైనా వెనకాడదన్న విషయాన్ని ఆ దాడులద్వారా స్పష్టం చేసిందని అన్నారు. పీర్‌పంజాల్, ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో భారీగానే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మరోసారి వీటిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సరిహద్దు చొరబాట్లను అదుపు చేయడంలో సైనిక దళాల చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అంబు ప్రశంసించారు