జాతీయ వార్తలు

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. శంషాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాస్సేపటికే విమానంలో సాంకేతికలోపం ఏర్పడడంతో విమానాన్ని వెంటనే కింది దింపేశారు. 20 నిముషాలు గాలిలోనే చక్కర్లు కొట్టి సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండైంది. దీంతో విమానంలోని 168 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని విమానాశ్రయం అధికారులు తెలిపారు.
వర్షంతో అంతరాయం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజులు కురిసిన వర్షాల కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమబ్బులు కమ్నుకోవడంతో విమానాలు కొద్దిసేపు ఆలస్యంగా నడిచినట్టు అధికారులు తెలిపారు. బుధవారం దాదాపు రెండుగంటలపాటు, గురువారం ఒక గంటపాటు వర్షం కురిసింది. కాగా వర్షం తగ్గడంతో విమానాలు షెడ్యూల్ ప్రకారమై నడిచాయని జిఎంఆర్ ప్రతినిధి కార్తీక్ మీడియాకు తెలిపారు.