జాతీయ వార్తలు

పోలీసు సంస్కరణల అమలుపై పిటిషన్ల విచారణకు బెంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పోలీసు సంస్కరణలపై 2006లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ దాఖలయిన పలు కోర్టు ధిక్కార పిటిషన్లను విచారించడానికి ఒక బెంచ్‌ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఈ నెల 11 లోగా ఒక త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం ఖన్వలికర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ తీసుకొంది. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు 2006లో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది, బిజెపి నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ్ తరఫు సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ అంటూ, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా విచారించాలని కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో పేర్కొన్నారు. మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన 2006 నాటి మోడల్ పోలీసు బిల్లును అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ్‌తో పాటుగా గతంలో పిటిషన్ దాఖలు చేసిన మాజీ డిజిపి ప్రకాశ్ సింగ్ కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ డిజిపిలు ప్రకాశ్ సింగ్, ఎన్‌కె సింగ్‌లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్) విచారించిన సుప్రీంకోర్టు 2006లో పలు విప్లవాత్మక సిఫార్సులు చేసింది. ప్రభుత్వాలు పోలీసులపై అనవసరమైన ప్రభావాన్ని చూపించకుండా ఉండడం కోసం ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలనేది అందులో ప్రధానమైనది. అలాగే డిజిపి, ఇతర పోలీసు అదికారుల నియామకాలు మెరిట్ ఆధారంగానే ఉండాలని, డిజిపిలు, ఎస్‌పిల కనీస పదవీ కాలం రెండేళ్లు ఉండాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా బదిలీలు, నియామకాలు, ప్రమోషన్లు, ఇతర సర్వీసుపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని న్యాయస్థానం తన తీర్పులో సూచించింది.