జాతీయ వార్తలు

వివాదం సృష్టించిన దిగ్విజయ్ టీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీని పరుష పదాలతో విమర్శిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఓ పెద్ద వివాదానికి తెరదీశారు.మోదీని దుషణాభాషతో మొదట నిందించిన ఆయన మళ్లీ దానినే ట్వీట్ చేస్తూ వివాదాన్ని మరింత రగిలించారు. దీనిపై ఆగ్రహించిన బిజెపి నాయకత్వం దిగ్విజయ్ చర్యకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మొదట చేసిన ట్వీట్‌లో మోదీని పరుషంగా విమర్శించిన ఆయన దాన్ని కాదంటూ రెండో ట్వీట్ చేశారు. అయితే రెండో ట్వీట్ అన్నది ఎంత మాత్రం ధ్రువీకరణ కాదని ఇది ట్విట్టర్ నియమమని స్పష్టం చేశారు.‘ఆ వ్యాఖ్యలు నావి కావుఅని స్పష్టం చేశాను. వాటిని నిరాకరించాను. ఆ పదాలను నేను వాడలేదు’అని మొదటి ట్వీట్‌పై చేతులెత్తేస్తూ రెండో ట్వీట్‌లోదిగ్విజయ్ వివరించారు. పైగా ప్రజలను ఫూల్స్‌ను చేసే కళలో మోదీ నిష్ణాతుడని తాను వ్యాఖ్యానించానని అందులో పరుషం ఏముందని ప్రశ్నించారు.