జాతీయ వార్తలు

సానుకూల దృక్పథంతో వెళ్తున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఉగ్రవాదంతో సతమతమవుతున్న జమ్మూ-కాశ్మీరులో అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు ‘సానుకూల దృక్పథంతో’ వెళ్తున్నానని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా తనతో మాట్లాడదల్చుకున్న ప్రతి ఒక్కరినీ కలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో ఒక కార్యక్రమం సందర్భంగా విలేఖరులకు తెలిపారు. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్, అనంత్‌నాగ్, జమ్మూ, రౌజౌరీలను సందర్శించి అక్కడి పౌర సమాజ సభ్యులు, రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు, వ్యాపారవేత్తలు తదితరులతో భేటీ కానున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ- కాశ్మీరు ప్రజలకు ఎన్నో వరాలను ప్రకటిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన జరుపబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ-కాశ్మీరు గవర్నర్ ఎన్‌ఎన్.వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశం కావడంతో పాటు రెండేళ్ల క్రితం ప్రధాన మంత్రి రూ.80 వేల కోట్లతో ప్రకటించిన ప్యాకేజీ కింద జరుగుతున్న అభివృద్ధి పనులను, రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.