జాతీయ వార్తలు

డిజైన్ నచ్చలేదనే రద్దుచేశారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్బనీ, సెప్టెంబర్ 8: పెద్దనోట్లు రద్దుచేయాలన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోదీకి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రద్దుయిన పెద్దనోట్లన్నీ తిరిగి బ్యాంకుల్లోకి వచ్చేయడంతో ఇది పూర్తిగా విఫలమైందని పేర్కొన్న ఆయన అసలు ‘మోదీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆర్‌బిఐకూ తెలియదు. ప్రధాన ఆర్థికవేత్తకూ తెలియదు. అప్పటి ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు’ అని శుక్రవారం ఇక్కడ జరిగిన సంఘర్ష్ ర్యాలీలో రాహుల్ అన్నా రు.‘అప్పటి 500, 1000 నోట్ల డిజైన్ నచ్చకపోవడం వల్లే మోదీ వాటిని రద్దుచేసినట్టుగా కనిపిస్తోంది’అని వ్యంగ్యోక్తి విసిరారు. నల్లధనాన్ని వెలికితీయడమే పెద్దనోట్ల రద్దుకు ప్రధాన కారణమంటూ మోదీ చెప్పడాన్ని ప్రశ్నించిన రాహుల్‌‘90 శాతం నల్లధనం భూములు, బంగారం, రియల్ ఎస్టేట్ స్విస్ బ్యాంకుల్లోనే ఉంది’ అని అన్నారు. కేవలం 10శాతం మొత్తం కోసమే పెద్దనోట్లు రద్దుచేసిన ప్రధాని 90 శాతం నల్లధనాన్ని వదలేశారని చెప్పారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు మోదీ దోహదం చేశారని, దగాకోరులు దీన్ని ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విమర్శించారు. 50 నుంచి 60 శాతం మంది పెద్దపారిశ్రామికవేత్తల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోందని విమర్శించిన రాహుల్ రైతుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. మహారాష్టల్రో 35వేల కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అందులో వాస్తవికంగా రద్దయింది 5వేల కోట్లేనని రాహుల్ విమర్శించారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి పట్టలేదని దుయ్యబట్టారు.

చిత్రం..శుక్రవారం జరిగిన సంఘర్ష సభ ర్యాలీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అభినందిస్తున్న కార్యక్తలు