జాతీయ వార్తలు

అక్షరాస్యతతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాకారమవుతుందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. భాగస్వామ్య ప్రజాస్వామ్య నిర్మాణానికి అక్షరాస్యత దోహదపడుందని ఆయన అన్నారు. శుక్రవారం విజ్ఞాన్‌భవన్‌లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప రాష్టప్రతి ప్రసంగించారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్, సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ, మానవ వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవం శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్, పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అనీల్ స్వరూప్‌లు హాజరైన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్ని దేశాల అభివృద్ధి నిర్మాణానికి గల ప్రాధాన్యతను అక్షరాస్యత సూచిస్తుందని అభిప్రాయపడ్డారు. దేశం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు. అక్షరాస్యత లేని దేశాలు అభివృద్ధి చెందలేవని ఆయన అన్నారు. అక్షరాస్యత ఎంత పెరిగితే అభివృద్ధి అంత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన వివిధ హక్కు లు, అధికారాలు, ప్రయోజనాలను వ్యక్తులు పొందేందుకు అక్షరాస్యత ఎంతో తోడ్పడుతుందని ఉపరాష్టప్రతి పేర్కొన్నారు. అక్షరాస్యత ఉం టేనే విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కు లు, ప్రయోజనాలను సాధించుకోగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. అక్షరాస్యత సాధించేందుకు రెండు మార్గాలున్నాయన్న ఉపరాష్టప్రతి ఒకటి ప్రీ ప్రైమరీ విద్యను పటిష్టం చేయటం, రెండోది బడికి వెళ్లనివారిని, డ్రాపవుట్లను చదువువైపుమళ్లీంచేంచడం అని ఆయన చెప్పారు. మహిళలు కొత్త అక్షరాస్యులు అక్షరాస్యతా కార్యక్రమానికి రాయబారులుగా బాగా సరిపోతారన్నారు. అక్షరాస్యతా కార్యక్రమాలకు మహిళల సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవటం ద్వారా భారత దేశాన్ని సాక్షర్ భారత తద్వారా సక్షం భారత్ చేయవచ్చునని ఉపరాష్టప్రతి పిలుపు ఇచ్చారు.
51వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంలో పాల్గొంటున్నందుకు తనకు సంతోషంగా ఉన్నదని ఆయన చెప్పారు. 1947లో స్వాతం త్య్రం వచ్చినప్పుడు దేశంలో కేవలం 18 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుంటే ఇప్పుడు 74 శాతం మంది ప్రాథమిక అక్షరాస్యులని వెంకయ్యనాయుడు చెప్పా రు. దేశంలోని 95 మంది పిల్లలు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు, 86 శాతం మంది యువకులు క్రియాశీలంగా ఆక్షరాస్యులని ఆయన తెలిపారు.

చిత్రం..అంతర్జాతీయ సాక్షరత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి జావడేకర్