జాతీయ వార్తలు

ఖాదీపై భారం వేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: దాదాపు 30 వస్తువులపై జిఎస్‌టిని తగ్గించామని, కెవిఐసి కేంద్రాల్లో విక్రయించే ఖాదీ దుస్తులపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని పూర్తిగా మినహాయించామని, కార్లపై జిఎస్‌టిలో స్వల్పంగా మార్పులు చేశామని, పన్ను చెల్లించేందుకు రిటర్న్స్ దాఖలు చేసే గడువును పొడిగించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన 21వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జైట్లీ మీడియాప్రతినిధులకు వెల్లడించారు. జైట్లీతోపాటు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. చింతపండు, కస్టర్డ్ పౌడర్, అగర్‌బత్తీలు, ఆహార వస్తువులపై పన్నును 28 శాతం నుండి 12 శాతానికి తగ్గించామన్నారు. ఆహార పదార్థాలు విడిగా అమ్మితే ఎలాంటి పన్ను లేదని, అయితే బ్రాండెడ్ పేర్లతో విక్రయించే పదార్థాలపై ఇప్పటికే 5 శాతం ఉన్న పన్ను కొనసాగుతుందన్నారు. కొంతమంది బ్రాండ్ పేరు తీసి కార్పొరేట్ పేర్లతో విక్రయిస్తున్నారని, అలాంటి వాటిపై కూడా పన్ను ఉంటుందని వివరించారు. హ్యాండిక్రాఫ్ట్స్ వ్యాపారం 20లక్షల రూపాయల లోపు టర్నోవర్ ఉంటే పన్ను విధించకూడదని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) కేంద్రాల్లో విక్రయించే ఖాదీ దుస్తులపై ప్రస్తుతం ఉన్న ఐదుశాతం జిఎస్‌టిని ఉపసంహరించామన్నారు. కార్లకు సంబంధించి 1200 సిసి సామర్థ్యం కలిగిన పెట్రోలు కార్లు, 1500 సిసి సామర్థ్యం కలిగిన డీజల్ కార్లపై ఇప్పటివరకు ఉన్న పన్ను యథాతథంగా కొనసాగుతుందన్నారు. మధ్యతరహా కార్లపై పన్నును 43 శాతం నుండి 45 శాతానికి అంటే రెండు శాతం పెంచామన్నారు. పెద్ద కార్లపై సెస్ 5 శాతం పెంచామని వివరించారు. స్పోర్ట్స్ వెహికిల్స్‌పై గతంలో 11 శాతం నుండి 7 శాతం తగ్గింపు అలాగే కొనసాగుతుందని, 13 సీట్ల వాహనాలు, హైబ్రీడ్ వాహనాలపై (విద్యుత్, బ్యాటరీ, పెట్రోలుతో నడిచేవి) పన్ను యథాతథంగా కొనసాగుతుందని వివరించారు. జూలైలో 95వేల కోట్ల వసూలు
జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తొలి నెల (జూలై)లో 95 వేల కోట్ల రూపాయలు వసూలయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. 10 లక్షల మంది పన్ను పరిధిలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారన్నారు. జిఎస్‌టిఆర్-1 దాఖలు చేసే గడువును 2017 అక్టోబర్ 10 వరకు పొడిగించామని, 100 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 3 లోగా రిటర్న్స్ దాఖలు చేయాలన్నారు. జిఎస్‌టిఆర్-2 దాఖలు చేసే గడువును అక్టోబర్ 31 వరకు, జిఎస్‌టిఆర్-3 దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 10 వరకు పొడిగించామన్నారు. జిఎస్‌టిఆర్-4కు గతంలో విధించిన గడువు అక్టోబర్ 18 తేదీలో ఎలాంటి మార్పు లేదన్నారు. జిఎస్‌టి-4ను జూలై నుండి సెప్టెంబర్ వరకు మూడు నెలల కాలానికి దాఖలు చేయాల్సిన అవసరం లేదని, జిఎస్‌టిఆర్-4ఎకు కూడా తొలి మూడు నెలలకు దాఖలు చేయనక్కర్లేదన్నారు. జిఎస్‌టిఆర్-3బిని 2017 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు
సమర్పించాలని వివరించారు. కంపోజిషన్‌ను ఎంచుకునేందుకు గడువును ఈ నెల 30 వరకు ఎంచుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు.
జిఎస్‌టి ట్రాన్‌ను ఒకసారి సవరించుకునేందుకు అవకాశం ఇచ్చామని, ఇందుకోసం గడువును అక్టోబర్ 31 వరకు (నెలరోజులు) పొడిగించామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
సమస్యలపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ
జిఎస్‌టి అమలు ప్రారంభమైన తర్వాత ఎదురవుతున్న ఐటి సవాళ్లను పరిశీలించి, అధ్యయనం చేందుకు మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని జైట్లీ తెలిపారు. అలాగే ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని, ఈ అంశంపై పరిశీలన చేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక కమిటీని నియమించామని జైట్లీ తెలిపారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన 21వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ