జాతీయ వార్తలు

జయంతి ఇంట్లో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతీ నటరాజన్‌కు చెందిన చెన్నై నివాసంలో సిబిఐ శనివారం సోదాలు నిర్వహించింది. యుపిఏ ప్రభుత్వ హయాంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం 120 బి సెక్షన్ కింద ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సిబిఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జెఎస్‌డబ్ల్యు లిమిటెడ్ కంపెనీ గనుల కోసం జార్ఖండ్‌లోని అటవీ భూములను అక్రమంగా కేటాయించినట్లు తేలడంతో ఇద్దరు అధికారులు, ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ లిమిటెడ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలపై జయంతీ నటరాజన్ 2013 డిసెంబర్‌లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌నుంచి వచ్చిన అభ్యర్థనల కారణంగానే కొన్ని పారిశ్రామిక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లు అప్పట్లో ఆమె ఆరోపించారు.