జాతీయ వార్తలు

శ్రీలంకతో సంబంధాలు మాకు ఎంతో ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: శ్రీలంకతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, విస్తృతం చేసుకోవడానికి ఆ దేశ నాయకత్వంతో కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలో మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపన శనివారం తనను కలుసుకున్నప్పుడు మోదీ ఆయనకు ఈ విషయం తెలియజేశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి తిలక్ మరపనతో విస్తృతస్థాయి చర్చలు జరిపినట్లు మోదీ ఒక ట్వీట్‌లో తెలిపారు. విదేశాంగ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన మరపనను ప్రధాని అభినందిస్తూ ఈ ఏడాది మేలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తాను శ్రీలంకలో జరిపిన ఫలప్రదమైన పర్యటనను గుర్తు చేసుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంకతో సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రధాని మరోసారి స్పష్టం చేశారని ఆ ప్రకటన తెలిపింది. రెండుదేశాల మధ్య బలమైన, విస్తృతమైన సంబంధాలున్న విషయాన్ని కూడా ఆ ప్రకటన గుర్తు చేసింది.