జాతీయ వార్తలు

జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుశ్మితా దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన లోక్‌సభ సభ్యురాలు సుశ్మితా దేవ్‌ను జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా స్థానంలో సుశ్మితాదేవ్ నియామకాన్ని ఆమోదించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శోభా ఓజా మహిళా కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు ఎంతో కృషి చేశారని సోనియా గాంధీ ప్రశంసించారు. కొత్త జాతీయ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్ నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ మరింత పటిష్టం కావటంతోపాటు దేశంలోని కోట్లాది మంది మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తారనే ఆశాభావాన్ని సోనియా వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కూతురైన సుశ్మితా దేవ్ లోక్‌సభలో అత్యంత క్రియాశీలకంగా ఉండే సభ్యురాలు. లోక్‌సభ కార్యక్రమాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాన్ని సుశ్మితా దేవ్ అత్యంత సమర్థంగా నిర్వహిస్తారు. షౌటింగ్ బ్రిగేడ్‌గా పేరుపడిన సుశ్మిత వివిధ అంశాలపై సభలో మాట్లాడటంలోనూ దిట్ట.