జాతీయ వార్తలు

శాంతి పునరుద్ధరణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 9: అశాంతికి నిలయంగా మారిన జమ్మూ, కాశ్మీర్‌లో శాంతిని పాదుకొల్పి, ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారంనుంచి నాలుగు రోజుల పర్యటనకు శ్రీనగర్ చేరుకున్నారు. ఇదే సమయంలో ఒక పోలీసు బృందంపై మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నెహ్రూ అతిథి గృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమైనారు. అనంతరం పౌర సంఘాల ప్రతినిధులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాన్‌బాల్‌లో పర్యటించి సిఆర్‌పిఎఫ్, పోలీసు అధికారులతోపాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడుతారు.
పోలీసు బృదంపై మిలిటెంట్ల దాడి
శనివారం అనంత్‌నాగ్ పట్టణంలో ఓ పోలీసు పార్టీపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక పోలీసు మృతిచెందగా, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం హోం మంత్రి భద్రతా అధికారులతో సమావేశం అయ్యే వేదికకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. మిలిటెంట్లు అనంత్‌నాగ్ జనరల్ బస్టాండ్ వద్ద పోలీసు పార్టీపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇంతియాజ్ అస్మద్ అనే పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా మరో కానిస్టేబుల్ షబీర్ అస్మద్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా, హోం మంత్రి పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్తితి తలెత్తకుండా చూడడం కోసం వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ షా జిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్‌లను గృహ నిర్బంధంలో ఉంచగా, మరో నేత యాసీన్ మాలిక్‌ను శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.

చిత్రం..శ్రీనగర్‌లో శనివారం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో
సమావేశమైన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్