జాతీయ వార్తలు

‘డేరా’లో బాణసంచా కర్మాగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్సా, సెప్టెంబర్ 9: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలుకెళ్లిన డేరా సచ్ఛా సౌదా గుర్మిత్ రామ్ రహీం సింగ్ స్థావరాలపై శనివారం రెండోరోజూ విస్తృతంగా సోదాలు జరిగాయి. మహిళా భక్తురాళ్లకోసం నిర్మించిన హాస్టళ్లలో పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. డేరా ప్రాంతంలో జరిగిన సోదాల్లో ఓ బాణసంచా కర్మాగారం, పేలుడు పదార్థాలు కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు. మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘సాధ్వీ నివాస్’ తలుపులు బద్దలుగొట్టి లోపల విస్తృతంగా సోదాలు జరిపినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా తెలిపారు. డేరాలో బయటపడ్డ భాగోతాలు మీడియాకు వెల్లడించే బాధ్యత మెహ్రాకు అప్పగించారు. ఓ ఫైబర్ టనె్నల్‌ను గుర్మిత్ సింగ్ ప్రాంగణంలో కనుగొన్నట్టు ఆయన వెల్లడించారు. ఆ సొరంగం మొత్తం మట్టితో నిండిపోయి ఉందన్నారు. అలాగే బాణసంచా కర్మాగారానికి ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా దాన్ని నిర్వహిస్తున్నారని అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం దాన్ని సీజ్ చేసినట్టు ఐ అండ్ పిఆర్ డిడి తెలిపారు. బాణసంచా తయారీకి ఉపయోగించే కొన్ని రసాయన పదార్థాలు లభించాయన్నారు. ఏకె 47 క్యాటరిడ్జ్ ఖాళీపెట్టే తాజా సోదాల్లో కనుగొన్నారని చెప్పారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర పోలీసు దళాలు, పారా మిలటరీ దళాలు, స్థానిక అధికారులు సోదాల్లో పాల్గొంటున్నారు. గుర్మిత్ సింగ్ స్థావరం ఓ మాఫియా డెన్‌కు ఏమాత్రం తీసిపోదు. రిజిస్ట్రేషన్ లేని ఓ లగ్జరీ కారు, రద్దయిన పెద్దనోట్లు, కొన్ని నిషేధిత ఔషధాలు శుక్రవారంనాటి సోదాల్లో దొరికిన సంగతి తెలిసిందే. డేరాబాబా రాసక్రీడలకోసం నిర్మించుకున్న డెన్‌నూ అధికారులు కనుగొన్నారు. డేరా స్థావరంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫొరెన్సిక్ లాబొరెటరీకి పంపారు.

చిత్రం..గుర్మిత్ రామ్ రహీం సింగ్ స్థావరంలో తనిఖీకోసం వస్తున్న అధికారుల బృందం