జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి, పరిపుష్టి చేయడానికే కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ ఫిక్కీ సమావేశంలో ప్రసంగిస్తూ నల్లధనం అరికట్టడానికే కేంద్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ప్రయోజం చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో పెద్దనోట్ల రద్దు ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ డిమోనిటేజేషన్ వల్ల 99 శాతం రద్దయిన నోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ అయ్యాయన్న విమర్శతో ప్రతిపక్షాలూ కేంద్రంపై దాడికి దిగాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా తాజా వ్యాఖలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘డిమోనిటేజేషన్‌వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న విశ్వాసం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం’ అని ఆయన అన్నారు.