జాతీయ వార్తలు

జెఎన్‌యూలో మళ్లీ గెలిచిన వామపక్ష విద్యార్థి సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: దేశ రాజధానిలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యూ)లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతృత్వంలోని వామపక్ష ఐక్య కూటమి (ఎఐఎస్‌ఎఫ్, డీఎస్‌ఎఫ్) విజయం సాధించింది. జెఎన్‌యూఎస్‌ఐ అధ్యక్షురాలిగా గీతాకుమారి గెలుపొందారు. గీతాకుమారి 1506 ఓట్లు సాధించారు. ఇక ఉపాధ్యక్ష స్థానంలో సిమోన్ జోయాఖాన్ 1,873 ఓట్లు సాధించారు. ప్రధాన కార్యదర్శి పోస్టుకు నల్గొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి దుగ్గిరాల శ్రీకృష్ణ అత్యధికంగా 2082 ఓట్లతో విజయం సాధించాడు. సంయుక్త కార్యదర్శి స్థానానికి పోటీచేసిన శుభాన్షు సింగ్ 1,755 ఓట్లు సాధించడం విశేషం. జెఎన్‌యూఎస్ అధ్యక్ష స్థానానికి ఎఐఎస్‌ఎఫ్ నుంచి పోటీచేసిన సిపిఐ ఎంపీ రాజా కుమార్తె అపరజిత రాజా కేవలం 416 ఓట్లు సాధించారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని వామపక్ష కూటమి అన్ని స్థానాలలో గెలుపొందిన విషయం తెలిసిందే.