జాతీయ వార్తలు

రాజకీయ రంగు పులుముకున్న పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 10: గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న నాయకులు క్రమంగా ఒక రాజకీయ పార్టీ వైపు ఒరిగిపోతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ శాసనసభకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనుండటంతో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం రాజకీయ రంగును పులుముకుంటోందని ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. రాష్ట్రంలోని పటేల్ సామాజికవర్గ ప్రజలకు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమం విషయంలో బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమిటని కొంతమంది యువకులు ప్రశ్నించగా, ఈ విషయంలో ‘న్యాయ ప్రక్రియ’ను అనుసరించాలని హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఆందోళనకారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, అయితే వారి ఆందోళన దిశ మారిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. ‘రిజర్వేషన్ల కోసం పటేల్ సామాజికవర్గ ప్రజలు భావోద్వేగంతో ఆందోళనలో పాలుపంచుకున్నారు. అయితే ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న వారు ఒక రాజకీయ పార్టీ చేతుల్లోకి ఒరిగిపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఈ విషయాలన్నీ మీకే అవగతమవుతాయి’ అని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లు పొందాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు న్యాయ ప్రక్రియను అనుసరించాల్సిందిగా ఆందోళనకారులను ఒప్పించేందుకు రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నించిందని అమిత్ షా పేర్కొంటూ, ఒక కులాన్ని ఓబిసి కేటగిరీలో చేర్చాలంటే అందుకోసం ముందు ఆ సామాజికవర్గం ఓబిసి కమిషన్‌కు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.