జాతీయ వార్తలు

జడ్జ్జి పోస్టులను భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను ఆంధ్రా, తెలంగాణ న్యాయవాదుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ సంఘాల అధ్యక్షులు చల్లా ధనుంజయ, జల్లి కనకయ్య, ఆంధ్రా న్యాయవాదుల సంఘం కార్యదర్శి హనుమంతరావు, తెలంగాణ సంఘం ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆదివారంనాడు ఆంధ్రా-తెలంగాణ భవన్‌లో వారు విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం హైకోర్టులో 61 మంది న్యాయమూర్తులు ఉండాలని, కాని కేవలం 27 మంది మాత్రమే ఉన్నారని, వారిలో ఇద్దరు రిటైర్ కాబోతున్నారని సిజెకి వివరించినట్టు తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో 3 లక్షల 36 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించినట్టు చెప్పారు. అదేవిధంగా రెగ్యులర్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమించాలని కోరినట్టు తెలిపారు.