జాతీయ వార్తలు

నేపాల్‌లో హనీప్రీత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: డేరా బాబా సన్నిహితురాలు, దత్త పుత్రికగా చెప్పబడుతున్న హనీప్రీత్ ఇన్సాన్ నేపాల్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో సరిహద్దులో గాలింపును ముమ్మరం చేశారు. ఆమె చిత్రపటంతో కూడిన పోస్టర్లను పరిసరాల్లోని పోలీసు స్టేషన్లవద్ద అంటించారు. నేపాల్‌లోకి దొంగతనంగా ప్రవేశించే అవకాశముందన్న సమాచారం మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నేపాల్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించకుండా హైఅలర్ట్ ప్రకటించారు. నేపాల్ సరిహద్దులోని కపిలవస్తు, మోహన, సోహ్రత్‌ఘర్, డెబారా పోలీసుస్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు సిద్దార్థ నగర్ ఎస్‌పి సత్యేంద్ర కుమార్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా హనీప్రీత్ కోసం గాలింపు ముమ్మరమైంది. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మహరాజ్‌గంజ్, లఖిమ్‌పూర్, బహ్రైచ్ జిల్లాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.