జాతీయ వార్తలు

మాతృభాషలోనే మాధుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: మాతృభాషలోని మాధుర్యం ఏ ఒక్కరికీ అన్యభాషలో ఉండదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం ఇక్కడ పేర్కొన్నారు. మాతృభాషలోనే మాట్లాడాలని ఉద్ఘాటించిన ఆయన ‘అమ్మా, అమీ అన్న మాటల హృదయంలోంచి వస్తాయని, మమీ,డాడీ అన్నవి పెదవుల నుంచి మాత్రమే వస్తా యి’అన్నారు. మాతృభాషలో అమ్మా అని పిలిచినప్పుడు కలిగే అనుభూతి ఆంగ్లంలో మమీ అని పిలిచినప్పుడు కలగదని ఇది కృతకంగా ఉంటుందని చెప్పారు. దేశ ప్రజలందరూ తమ మాతృభాషలోనే మాట్లాడాలని ఇక్కడ జరిగిన సంగీత కోవిధురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్పష్టం చేశారు. సొంత వ్యక్తులతో మాట్లాడినప్పుడు మాతృభాషలోనే మాట్లాడాలన్న ఆయన విదేశీయులతో మాట్లాడేటప్పుడు వారి భాషలోనే మాట్లాడడం మంచిదని ఉప రాష్టప్రతి అన్నారు.
హిందీ అయినా సంస్కృతమైనా ఉర్దూ అయినా తెలుగు అయినా కూడా మాతృభాషలో మాట్లాడితేనే ఆ భాష లాలిత్యం తెలుస్తుందని చెప్పారు.

చిత్రం.. ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి సందర్భంగా
వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్య