జాతీయ వార్తలు

ఉగ్ర స్థావరాలను ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కేంద్రాలున్నా సహించేది లేదని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ మంగళవారం నాడిక్కడ ఉద్ఘాటించారు. ఇలాంటి ఉగ్రవాద సురక్షిత కేంద్రాలను నిర్మూలించడమే ధ్యేయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ ఉగ్రవాద మహమ్మారిని తుదముట్టించేందుకు కలిసికట్టుగా పని చేయాలని భారత్, అమెరికాలు తీర్మానించుకున్నాయని తెలిపారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనార్థం మంగళవారం ఢిల్లీ వచ్చిన మాటిస్ భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనారు. పాకిస్తాన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మాటిస్ మాటల్లో అది ప్రస్ఫుటమైంది. భారత్, అమెరికాలు దీర్ఘకాలంగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న ఆయన ఉగ్రవాదం వల్ల మొత్తం ప్రపంచ శాంతికే భంగం కలుగుతుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు. అఫ్గానిస్థాన్‌కు సంబంధించి భారత్ చేస్తున్న కృషిని మాటిస్ ప్రశంసించారు. ఈ విషయంలో భారత్ చేట్టిన చర్యలను అభినందిస్తున్నామని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, భద్రత, రక్షణ విషయంలో భారత్
ఎంతగానో అఫ్గాన్‌కు తోడ్పడుతోందన్నారు.
ఈ సమావేశానంతరం ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేందుకు కలిసి కట్టుగా పని చేయాలని తీర్మానించుకొన్నట్లు ఇందులో తెలిపాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత్, అమెరికాల మధ్య ప్రాథమిక విలువలు, ప్రపంచ ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి భావనలున్నాయన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఈ రెండు దేశాలు ఎన్నో అంశాలపై భావ సారూప్యతను కలిగి ఉన్నాయన్నారు.ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం ఇటీవలి కాలంలో గణనీయంగా పెంపొందిందని వెల్లడించిన సీతారామన్ ‘అత్యాధునిక రక్షణ పరికరాలను భారత్‌కు అందిస్తున్న ప్రధాన దేశాల్లో అమెరికా ఒకటి’ అని తెలిపారు. అంతకుముందు మాటిస్ ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించడమే కాకుండా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్