జాతీయ వార్తలు

లష్కరే ఇస్లాం చీఫ్ ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 26: కరుడుకట్టిన ఉగ్రవాది లష్కరే తోయిబా ఇస్లాం అధినేత అబ్దుల్ ఖయూమ్ నజార్‌ను భద్ర తా దళాలు మంగళవారం అంతం చేశా యి. యూరి సెక్టార్‌లోని జోరావార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఖయూం హతుడయ్యాడు. అతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో కూడా సంబంధాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధాలున్న ఖయూం ఆచూకీ చెప్పినవారికి పది లక్షల రూపాయల బహుమతిని కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. లష్కరే ఇస్లాంలో ఖయూం కీలక పాత్ర వహించినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోంది. 41 సంవత్సరాల ఖయూమ్‌ను హజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ గతంలో బహిష్కరించారు. అత్యంత సాహసోపేతమైన రీతిలో భద్రతా దళాలు ఈ కీలక ఉగ్రవాదిని అంతం చేసినట్టుగా రక్షణ వర్గాలు తెలిపాయి.