జాతీయ వార్తలు

ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ మారణహోమం, కాశ్మీర్, ముజఫర్‌నగర్‌లలోముస్లింలను చంపేసినందుకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తులతో వస్తున్నామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో అరబిక్ భాషలో ఉంచిన 22 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో భారత్‌నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తమ సంస్థలో ఏయే హోదాలో ఉన్నారో కూడా వివరించింది. 2014నుంచి ఇరాక్, సిరియాలలో ఫైటర్‌గా కొనసాగుతున్న ఆ అయిదుగురి ఇంటర్వ్యూలను కూడా ఆ వీడియోలో ఉంచింది. శుక్రవారం ఉదయం ఈ వీడియో ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టిపెట్టి ఐఎస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన తొలి వీడియో ఇదే కావడం గమనార్హం. ఈ వీడియోలో ఉన్న అయిదుగురు భారతీయుల్లో ఒకరిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. 2014లో మరో ముగ్గురితో కలిసి ముంబయినుంచి సిరియాకు వెళ్లిన ఠాణె కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఫహాద్ తన్వీర్ షేక్ అబూ అమర్ అల్ హిందీ అనే మారు పేరుతో ఆ వీడియోలో మాట్లాడాడు. ఐఎస్‌లో చేరడానికి సిరియా వెళ్లి గత ఏడాది రఖ్ఖా బాంబు దాడిలో మృతి చెందిన తన మిత్రుడు షమీమ్ తంకికి షేక్ ఆ వీడియోలో నివాళి అర్పించాడు. ఈ గ్రూపులోని మూడో వ్యక్తి అరీబ్ మజీద్‌ను ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్‌ఐఏ) విచారిస్తోంది. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ మారణ కాండ, కాశ్మీర్, ముజఫర్‌నగర్ తదితర విధ్వంసకాండలకు ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నామని ఆ వీడియోలో అతను హెచ్చరించాడు.