జాతీయ వార్తలు

హనీకి ఢిల్లీ హైకోర్టు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, సెప్టెంబర్ 26: డేరా బాబా దత్తపుత్రికగా చెలామణీ అవుతోన్న హనీప్రీత్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. మంగళవారం హనీప్రీత్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదంటూ ఆమెతరఫు న్యాయవాదిని నిలదీసింది. అరెస్ట్ భయంతోనే హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారని, ఆమెకు ఢిల్లీలో ఇల్లువుందన్న న్యాయవాది వాదనను న్యాయస్థానం తప్పుబట్టింది. ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నారు.