జాతీయ వార్తలు

టీం స్పిరిట్‌తో కదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశ స్వాతంత్య్రయోధులు కలలుగన్న నవభారతాన్ని ఆవిష్కరించే దిశగా ఉమ్మడి స్ఫూర్తి, చిత్తశుద్ధితో పని చేయాలని యువ ఐఏఎస్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లకాలంలో సమరయోధుల కలలను నెరవేర్చే దిశగా భారతావనిని తీర్చిదిద్దే బాధ్యతను స్ఫూర్తిదాయక రీతిలో భుజాన వేసుకోవాలని సూచించారు. మంగళవారం నాడిక్కడ 2015 ఐఏఎస్ బ్యాచ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిఎస్టీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలను అవగతం చేసుకోవాలని వారిని కోరారు. ముఖ్యంగా భీమ్ యాప్ తదితరాల ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలకు వూతాన్నిచ్చే రీతిలో చర్యలు చేపట్టాలన్నారు. ఐఏఎస్ అధికారుల ప్రధాన లక్ష్యము, కర్తవ్యమూ దేశ సంక్షేమం ప్రజాహితమే కావాలని మోదీ ఉద్ఘాటించారు. తాము ఎక్కడ పని చేసినా అందరినీ కలుపుకుని పోయే స్ఫూర్తిని విడనాడకూడదని, అలాగే బృందాలను ఏర్పా టు చేసుకుని లక్ష్యాలను సాధించాలన్నారు. తమతమ విభాగాల్లో ప్రభుత్వం చేపట్టిన ఈ-మార్కెట్ (జిఇఎం)ను అమలు చేయాలని, దాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఇది పటిష్టంగా అమలైతే దళారుల ప్రమేయం తొలగిపోతుందని, ప్రభుత్వ ఖర్చు మిగులుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య లక్ష్యాలను, గ్రామీణ విద్యుద్దీకరణ పథకాల గురించి మాట్లాడిన మోదీ, నూటికి నూరు శాతం వీటిని సాధించేందుకు తోడ్పడాలని యువ ఐఏఎస్‌లకు పిలుపునిచ్చారు.

చిత్రం..ఢిల్లీలో నిర్వహించిన యువ ఐఏఎస్ అధికారుల సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ