జాతీయ వార్తలు

షార్‌లో ప్రమాదం..ఒకరికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సీనియర్ టెక్నిషియన్ శ్రీకాంత్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు శ్రీహరికోటలోని స్రాప్ వద్ద 140 నెంబరుగల భవనంలో ఘన ఇంధన తయారీ కేంద్రంలో వ్యర్థాలు తొలగించే సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి ఉద్యోగులు అతన్ని శ్రీహరికోటలో ఉన్న వైద్యశాలకు హుటాహుటిన తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని షార్ కంట్రోలర్ రాజారెడ్డి, పోలీసులు వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.