జాతీయ వార్తలు

మేజర్ ఉపాధ్యాయ్‌కు బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 26: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరయిన రిటైర్డ్ ఆర్మీ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్‌కు బాంబే హైకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మిగతా ప్రధాన నిందితులందరికీ హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినందున న్యాయమూర్తులు రంజిత్ మోరే, సాధనా జాదవ్‌లతో కూడిన బెంచ్ ఉపాధ్యాయ్‌కు లక్ష రూపాయల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులపై బెయిలు మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది సందేశ్ పాటిల్ ఉపాధ్యాయ్ బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకించగా, సమన్యాయం పాటించాలన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసిన దృష్ట్యా తమ చేతులు కట్టేశారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పేలుడులో ఉపాధ్యాయ్ పాత్ర, ఈ కేసులో ప్రధాన నిందితుడు, సుప్రీంకోర్టు గత ఆగస్టులో బెయిలు మంజూరు చేసిన లెఫ్టెనెంట్ కల్నల్ పురోహిత్‌కన్నా పెద్దదా? అని కూడా బెంచ్ ప్రశ్నించింది. దానికి కాదని ఉపాధ్యాయ్ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. అంతేకాదు, పురోహిత్‌కు బెయిలు మంజూరయిందని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. సమానన్యాయం ప్రాతిపదికపై ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసిందని కూడా న్యాయవాది తెలిపారు. దీంతో బెంచ్ ఉపాధ్యాయ్‌కు బెయిలు మంజూరు చేసింది. 2008 సెప్టెంబర్ 28న మహారాష్టల్రోని మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, వందమందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.