జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మొగ్గ తొడుగుతున్న శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 26: జమ్మూ, కాశ్మీర్‌లో శాంతి మొగ్గ తొడుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాశ్మీర్ ప్రజలకు చేరువ కావడానికి కేంద్ర ప్రభుత్వం, అధికార పార్టీ చేస్తున్న కృషిని సైతం ఆమె ప్రశంసించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి నాయకుడు రామ్ మాధవ్ తదితర నేతలు వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్‌లో శాంతి తిరిగి నెలకొనాలని కోరుకొంటున్న రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ మంచి సంకేతాలని పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెహబూబా అన్నారు. కాశ్మీర్‌లో శాంతి మొగ్గ తొడుగుతోందని ఆమె అన్నారు. దీనికి మరింతగా నీళ్లు పోసి ఎరువులు వేసి పెంచి పోషించాలని అంటూ, శాంతి ఫలాలు తప్పక వస్తాయన్న గట్టి నమ్మకం ఉందన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా కాశ్మీర్‌ను తప్పుగా చిత్రీకరిస్తోందని కూడా ఆమె ఆరోపించారు. చిన్న చిన్న సంఘటనలను కూడా జాతీయ ప్రాధాన్యత గల అంశాలుగా ఎలక్ట్రానిక్ మీడియా చిత్రీకరిస్తోందని, అనవసరపు చర్చలను నిర్వహిస్తూ కాశ్మీర్ మండిపోతోందనిపించేలా చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇలాంటి వాటి కారణంగా కాశ్మీర్ ప్రజలకు, దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతోందని, ఫలితంగా రాష్ట్రానికి జీవ నాడి అయిన పర్యాటక రంగంపై దీని ప్రభావం పడుతోందని ఆమె అన్నారు. గతంలో ప్రతి రోజూ రాష్ట్రానికి పదినుంచి 20 వేల మంది పర్యాటకులు వస్తూ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య నాలుగునుంచి అయిదు వేలకు పడిపోయిందని పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తున్న మెహబూబా అన్నారు. హోటళ్లు, హౌస్‌బోట్లు చాలావరకు ఖాళీగా ఉంటున్నాయని ఏదో ఒక కారణంతో తరచూ దుకాణాలు మూతపడుతూ ఉండడంతో వ్యాపారం కుదేలయిపోయిందని అన్నారు. కేవలం 200 మంది మిలిటెంట్ల గురించే మాట్లాడుతున్నారు తప్ప భారత సైన్యంలో ఉన్న వేలాది మంది కాశ్మీరీల గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.