జాతీయ వార్తలు

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటుకున్నారు. శనివారం ప్రకటించిన ఈ ఫలితాల్లో బాలికలు 88.58 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 78.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో బాలుర కంటే బాలికలదే పైచేయి అని మరోసారి రుజువైంది. ఈ పరీక్షలో దక్షిణ భారత విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ముఖ్యంగా 97.61 శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం రీజియన్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, చెన్నై రీజియన్ 92.63 శాతం ఉత్తీర్ణతతో ద్వితీయ స్థానంలో నిలిచింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా, ఈ ఏడాది వారి సంఖ్య 83.05 శాతానికి పెరిగింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 10,65,179 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ పరీక్షకు హాజరైన వారికంటే ఇది 2.38 శాతం అధికం. ప్రస్తుతం వరుసగా రెండో సంవత్సరం దేశంలోని మొత్తం పది రీజియన్ల పరీక్షా ఫలితాలను ఒకేరోజు ప్రకటించామని సిబిఎస్‌ఇ న్యూఢిల్లీలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షా ఫలితాలను ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. రిజల్ట్స్.నిక్.ఇన్’, ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సిబిఎస్‌ఇరిజల్ట్స్. నిక్.ఇన్’, ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సిబిఎస్‌ఇ.నిక్.ఇన్’ అనే మూడు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచడంతో పాటు బోర్డుతో రిజిస్టరై ఉన్న ఇ-మెయిళ్ల ద్వారా పాఠశాలలు ఆటోమ్యాటిక్‌గా ఈ ఫలితాలను పొందే వీలు కల్పించారు. అలాగే ఈ ఏడాది నుంచి సిబిఎస్‌ఇ 12వ తరగతి విద్యార్థులకు డిజీలాకర్ ద్వారా డిజిటల్ మార్కుల జాబితాలను అందజేయనుంది. ఇవి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.డిజిలాకర్.గవ్.ఇన్’ వెబ్‌సైట్‌లో ఉంటాయి. డిజీలాకర్ ఖాతాకు సంబంధించిన వివరాలను సిబిఎస్‌ఇ లో విద్యార్థులు నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సందేశాల (ఎస్సెమ్మెస్‌ల) ద్వారా అందజేస్తారు.
ఢిల్లీ విద్యార్థినికి అగ్రస్థానం
ఇదిలావుంటే, ఈ ఏడాది సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షల్లో ఢిల్లీకి చెందిన సుకృతి గుప్తా అనే విద్యార్థిని 99.4 శాతం మార్కులు సాధించి సత్తా చాటుకుంది. అశోక్ విహార్‌లోని మోంట్‌ఫోర్ట్ పాఠశాలకు చెందిన సుకృతి గుప్తా మొత్తం 500 మార్కులకు గాను 497 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలువగా, కురుక్షేత్ర (హర్యానా) లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన పాలక్ గోయెల్ అనే విద్యార్థి 496 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అయితే కర్నాల్ (హర్యానా)లోని సెయింట్ థెరిస్సా కానె్వంట్ స్కూల్‌కు చెందిన సౌమ్య ఉప్పల్‌తో పాటు చెన్నైలోని పిఎస్‌బిబి సీనియర్ సెకండరీ స్కూల్‌కు చెందిన అజిష్ శేఖర్‌లకు సరిసమానంగా 495 మార్కులు లభించడంతో వారిద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకున్నారు.

chitram ఆనందంలో టాపర్ సుకృతి గుప్తా కుటుంబం