జాతీయ వార్తలు

హిందువునని నిరూపించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన గుజరాత్ పర్యటనలో పలు హిందూ అలయాలను సందర్శించడాన్ని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఎద్దేవా చేస్తూ ముందు మీరు హిందువు అనే విషయాన్ని రుజువు చేసుకోండంటూ రాహుల్‌కు సూచించారు. ‘తాను హిందువునని ఆయన మొదట ప్రకటించాలి’ అని స్వామి గురువారం విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాహుల్ గాంధీ క్రైస్తవుడని, సోనియా నివాసమైన 10 జన్‌పథ్ లోపల ఒక చర్చి ఉందని తనకు అనుమానంగా ఉందని కూడా స్వామి అన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రాహుల్ గాంధీ మూడు రోజులపాటు పర్యటించిన విషయం తెలిసిందే. బిజెపి పాలిత రాష్ట్రంలో ఆయన పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సురేందర్ నగర్ జిల్లాలోని చోటిలా ఆలయాన్ని, కగ్వాడ్ గ్రామంలోని ఖోడల్ ధామ్ ఆలయాన్ని, రాజ్‌కోట్ జిల్లా వీర్‌పూర్‌లో జలరామ్ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు.
బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అతివాద హిందుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టడమే రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ అంటుండగా, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించదు కనుకనే ఆయన గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని బిజెపి ఎద్దేవా చేస్తోంది. హిందువుల పట్ల ప్రేమతో రాహుల్ ఆలయాలను సందర్శించలేదని, ఇదంతా కేవలం కంటితుడుపు చర్య అని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు.