జాతీయ వార్తలు

డేరా ముఠా నుంచి ప్రాణహాని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాల్, సెప్టెంబర్ 28: డేరాబాబా గుండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడ్డ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. డేరా సచ్ఛా సౌదాలోని ఖుర్బానీ విభాగం నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆయన వాపోయాడు. ఖుర్బానీ విభాగం తనను చంపుతానంటూ లేఖ రాసిందని గుప్తా ఆరోపించారు. గురువారం అతడు తండ్రి మహేందర్ గుప్తాను వెంటబెట్టుకుని కర్నాల్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. డేరాబాబా ముఠా నుంచి తనకు ప్రాణహాని ఉందని విశ్వాస్‌గుప్తా భయం వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హనీప్రీత్‌కు విశ్వాస్ గుప్తాకు 1991లో వివాహమైంది. తొలి రోజుల్లో దంపతులిద్దరూ డేరాబాబా ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. తరువాత విభేదాలు రావడంతో విడిపోయారు. హనీప్రీత్‌కు డేరాబాబా గుర్మీత్‌సింగ్‌తో అక్రమ సంబంధం ఉందని గుప్తా ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటకు చెబుతున్నానే కారణంతో డేరాబాబా గుండాలు తనను చంపడానికి చూస్తున్నారని ఆయన చెప్పారు. రామ్హ్రీం పరువుతీస్తున్నావంటూ బెదిరింపుఫోన్లు వస్తున్నాయని విశ్వాస్ ఆందోళన చెందారు.‘సెక్టార్ పోలీసు స్టేషన్‌లో గుప్తా ఫిర్యాదు చేశారు. నాకు ప్రాణహాని ఉందని, బెదిరింపుఫోన్లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపతున్నాం’ అని కర్నాల్ సిటీ పోలీసు ఇన్స్‌పెక్టర్ రాజ్‌బీర్ సింగ్ వెల్లడించారు. డేరాబాబాకు వ్యతిరేంగా వార్తలు రాసినా, ప్రచారం చేసినా ప్రజాగ్రహానికి గురికావల్సి వస్తుందంటూ విలేఖరులు, చానళ్లకు బెదిరింపు లేఖలు వస్తున్నాయి.